prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 6:54 pm Digital Edition : MAHESH MEDCHAL

రాంగ్‌రూట్‌లో వచ్చిన స్కూల్ బస్సు ఢీ యువకుడికి తీవ్ర గాయాలు

రాంగ్‌రూట్‌లో వచ్చిన స్కూల్ బస్సు ఢీ యువకుడికి తీవ్ర గాయాలు

మేడ్చల్: జాతీయ రహదారి 44పై లోటస్ వెంచర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్‌రూట్‌లో వస్తున్న జీవికె ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదంలో ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సైదోనిగడ్డ తాండకు చెందిన నూనావత్ సాయి (23) తీవ్ర గాయాలపాలయ్యాడు. సాయి కిషన్ కుమారుడని, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం తీవ్రంగా గాయపడిన సాయిని వెంటనే మేడ్చల్‌లోని మెడినోవా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వాహనాలు ప్రయాణించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.