రసాభాసగా ఇంద్రానగర్‌లో రోడ్డు వెడల్పు పనులు

రసాభాసగా ఇంద్రానగర్‌లో రోడ్డు వెడల్పు పనులు ఒకవైపే రోడ్డు తొలగిస్తున్నారంటూ కాలనీవాసుల ఆగ్రహం మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో గురువారం ఉదయం రోడ్డు వెడల్పు పనులు రసాభాసగా మారాయి. రోడ్డు విస్తరణలో అధికారులు, కాంట్రాక్టర్ ఒకవైపు మాత్రమే రోడ్డు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు వెడల్పు చేయాలంటే ఇరువైపులా సమానంగా స్థలం తీసుకోవాల్సి ఉండగా, కాంట్రాక్టర్ ఒకవైపునే పనులు చేపడుతున్నారని కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త...