prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 8:38 pm Digital Edition : GIRIBABU KONDHURG

యువతి ఉరివేసుకుని ఆత్మహత్య

యువతి ఉరివేసుకుని ఆత్మహత్య

తిమ్మారెడ్డిగూడ గ్రామంలో మద్దూరి మౌనిక (29) అనే వివాహిత మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది.

మౌనికకు సుమారు మూడు సంవత్సరాల క్రితం రాజశేఖర్‌తో వివాహం జరిగింది. వీరికి 15 నెలల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలంగా మౌనిక అనారోగ్యంతో పాటు మానసికంగా కూడా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

17.08.2026న సాయంత్రం సుమారు 4:00 గంటల సమయంలో మౌనిక బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి చూడగా, ఆమె కిటికీకి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే చున్నీని విప్పి చూడగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

మౌనిక అనారోగ్యం మరియు మానసిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆమె తండ్రి చిట్ల సైలూ తెలిపారు. తన కుమార్తె మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.