prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 7:05 pm Digital Edition : MAHESH MEDCHAL

మేడ్చల్ 297 డివిజన్‌లో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ

మేడ్చల్ 297 డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠశాల యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆర్.ఆర్. ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామన్న గారి రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వయంగా యూనిఫామ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ప్రోత్సాహానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కటిక వినయ్, శ్రీనాథ్ ముదిరాజ్ (అవతార్), రఘు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్.ఆర్. ఫౌండేషన్ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.