prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 5:43 pm Digital Edition : MAHESH MEDCHAL

మేడ్చల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

*మేడ్చల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు*


మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ *మేడ్చల్ లో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న,స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మేడ్చల్ 297 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మేడ్చల్ 297 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్ మాట్లాడుతూ.. దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు.దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన ఎంతో ముందుచూపుతో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.ఆధునిక భారతదేశ నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని,దేశం కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడని పేర్కొన్నారు.ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు*.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ 297 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు (చాపరాజు)ముదిరాజ్,కిష్టాపూర్ పూడూర్ 298 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు కురుమ,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చీర్ల రమేష్ కురుమ,జాకట దేవరాజ్,కౌడే మహేష్ కురుమ,సముద్రం సాయి కుమార్,మర్రి నర్సింహ్మ రెడ్డి,పాలకుర్తి రాఘవేందర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోమారం బాల్ రెడ్డి,రామన్నగారి రాఘవేందర్ గౌడ్,నడికొప్పు రంజిత్ ముదిరాజ్,వేముల శ్రీనివాస్ రెడ్డి,పెగుడ శ్యాంరావు,దుర్గం వెంకటేష్ ముదిరాజ్,మేకల రాజశేఖర్ రెడ్డి (బబ్లూ),ఉదండపురం సత్యనారాయణ,రామన్నగారి సంతోష్ గౌడ్,సత్తి రెడ్డి,ప్రభు ముదిరాజ్,హనుమంత్ రెడ్డి,పానుగంటి మహేష్,కొండల్ రెడ్డి,మహమ్మద్ ఆరీఫ్,యాదగిరి,మోహన్ రెడ్డి,గణేష్,ఆటో విజయ్,ఐఎన్టియుసి నాయకులు చంద్రయ్య గౌడ్,మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి,మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ,మేడ్చల్ మున్సిపాలిటీ ఎస్ సి సెల్ అధ్యక్షులు దండు శ్రీకాంత్ (చింటు),ఇందిరమ్మ కమిటీ సభ్యులు,నాయకులు,కార్యకర్తలు,యువకులు,మహిళలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.