మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించాలి
*మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించాలి* *ఎంపీ ఈటల రాజేందర్‌కు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో వినతిపత్రం* మేడ్చల్ ఆగస్టు 18 (పీపుల్స్ డైరీ):- మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ముఖ్యమైన రైళ్లకు హాల్ట్ కల్పించాలని కోరుతూ మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు, రైల్వే అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మేడ్చల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైల్వే...