మేడ్చల్‌లో లోటస్ హాస్పిటల్స్ సాంకేతిక సహకారంతో మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ప్రారంభం
ఒక శిశువు జన్మించిన క్షణం కుటుంబానికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. అయితే నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో జన్మించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆక్సిజన్ లోపం వంటి పరిస్థితులు ఎదురైతే అదే ఆనందం ఒక్కసారిగా ఆందోళనగా మారుతుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకమే. అలాంటి సమయంలో “అత్యవసర చికిత్స కోసం దూర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా.. స్థానికంగానే అత్యాధునిక వైద్యం” అందించేందుకు మేడ్చల్‌లో మరో కీలక వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మేడ్చల్‌కు కొత్త వైద్య...