prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:17 pm Digital Edition : SRIKANTH MULUGU

మేడారంలో నార్కోటిక్స్ డాగ్ తో సడెన్ చెక్స్

.కిరాణా షాపుల్లో నార్లాపూర్ ఎస్.ఐ కమాలకర్ తనిఖీలు.
.గంజాయిపై ఉక్కుపాదం – మేడారంలో షాపుల తనిఖీలు.

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-

ఎస్ఎస్ తాడ్వాయి మండలం,మేడారం
నార్లాపూర్ ఎస్.ఐ మంగళవారం మేడారం ప్రాంతంలోని సందేహాస్పద కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నార్కోటిక్స్ డాగ్ సహాయంతో షాపులను క్షుణ్ణంగా పరిశీలించారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ నిల్వలు, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
షాపు యజమానులకు నిబంధనలు పాటించాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.
భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఎస్.ఐ తెలిపారు.