మెదక్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
మెదక్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం మెదక్, ఆగస్టు 13: భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వికసిత భారత్ లక్ష్యంగా మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా...