మీరాలం కుంటలో మట్టి పూడ్చినా చర్యలేవీ?పోలీసుల తీరుపై మండిపడ్డ బాలగౌని సుమన్ గౌడ్, రావుల శ్రీకాంత్

ఘాట్‌కేసర్, ఆగస్టు 11 (ప్రజా వాణి): చెరువుల పరిరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని యువజన నాయకులు బాలగౌని సుమన్ గౌడ్, రావుల శ్రీకాంత్ ప్రశ్నించారు. పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న చారిత్రాత్మక మీరాలం కుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో ‘బతుకమ్మ ఘాట్’ పేరుతో అక్రమంగా మట్టి పూడ్చి ఆక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరాలం కుంటను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులు, చెరువు...