prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 12:45 pm Digital Edition : RAJASHEKARREDDY

మిషన్ భగీరథ లికేజ్ పైపుకు మరమ్మతులు -లీకేజీతో వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట

బెజ్జంకి, ఆగష్టు 20 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో కొన్ని నెలలుగా లీకేజీ కారణంగా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్న పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. లీకేజీని గుర్తించిన గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ఆధ్వర్యంలో పైప్‌లైన్‌ను మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టారు.
గ్రామంలో తాగునీటి వృథాను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని, పైప్‌లైన్ వద్ద సమస్యలు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.