prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 8:13 am Digital Edition : PRAJA VANI

మార్కెట్ యార్డులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన బల్లా పల్లవి

అనంతపురం బ్యూరో
ఆగస్టు 15 ప్రజా వాణి
అనంతపురం నగర సమీపంలో ఉన్న
మార్కెట్ యార్డులో అధికారుల, డైరెక్టర్ల సమక్షంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని  పురస్కరించుకుని
జాతీయ పతాకాన్ని  మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి త్యాగాల స్ఫూర్తితో రైతుల సంక్షేమం, ప్రజా సేవ, మార్కెట్ యార్డు అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఎంతోమంది మహానుభావుల స్ఫూర్తితో  ముందుకెళ్లాలని చైర్పర్సన్ బల్లా  పల్లవి పిలుపునిచ్చారు.
నూతనంగా నిర్మించిన షెడ్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించిన   బల్లా పల్లవి మార్కెట్ యార్డు లో  నూతనంగా నిర్మించిన షెడ్ , గెస్ట్ హౌస్ ను అధికారులు డైరెక్టర్ల సమక్షంలో చైర్ పర్సన్  బల్లా పల్లవి ప్రారంభించడం జరిగింది. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో  ఈ వసతులను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మౌలిక వసతులను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని బల్లా పల్లవి స్పష్టం చేశారు.