prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 9:55 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

మానవసేవే మాధవసేవగా భావిస్తున్న ఏం.ఏ హకీమ్.

మానవసేవే మాధవసేవగా భావిస్తున్న ఏం.ఏ హకీమ్.

ఆడపిల్ల వివాహానికి ఆర్థిక చేయూత.

వర్షానికి ఇల్లు కూలిన అనాధకు సహాయం.

ఆడబిడ్డకు ఏం.ఏ హకీమ్ తాత కానుకగా విస్తృత సేవలు.

కోటగిరి/ప్రజావాణి:-ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకుంటూ మానవత్వమే తన ధర్మంగా ముందుకు సాగు తున్న సామాజిక సేవాకర్త ఏం.ఏ హకీమ్ తన సేవా కార్యక్ర మాలతో నిత్యం నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబా నికి చెందిన మౌలానా కుమార్తె వివాహానికి ఆర్థిక స్థోమత లేక దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్న విషయం తెలుసుకున్న హకీమ్ వెంటనే స్పందించారు.తన సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అనాధ అఫ్రోజ్ దయనీయ పరిస్థితిని స్థానికుల ద్వారా తెలుసుకున్న ఆయన వెంటనే అతనికి ఆర్థిక సహాయం అందించి తక్షణ అవసరాలు తీర్చారు.ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అతనికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా హకీమ్ మాట్లాడుతూ.పోతంగల్ మండలంలో నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ తొలి కాన్పులో ఆడపిల్లకు జన్మనిస్తే ఆ చిన్నారికి హకీమ్ తాత కానుకగా రూ.5 వేలు ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందజేస్తానని అన్నారు.మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాననీ.నిరాశ్రయులైన నిరు పేదలకు ప్రభుత్వాలు,ప్రజాప్రతినిధులు తప్పకుండా అండగా ఉండాలన్నారు.