prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 10:25 am Digital Edition : PRAJA VANI

మాతా ఆయుర్వేద వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

..

కేరళ పంచకర్మ వైద్య విధానాల పరిశీలన..
కోదాడ, ఆగస్టు 15/ ప్రజావాణి ప్రతినిధి):కోదాడ పట్టణంలోని మాతా ఆయుర్వేద వైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలను, అక్కడ అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కేరళ సాంప్రదాయ పద్ధతిలో అందిస్తున్న పంచకర్మ వైద్య విధానాన్ని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ చికిత్స ఏ విధంగా ఉపయోగపడుతుందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ… ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు కేరళ స్థాయి పంచకర్మ వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం అభినందనీయమని వైద్యశాల యాజమాన్యాన్ని అభినందించారు. ప్రజలు అల్లోపతితో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి ఆయుర్వేద చికిత్సలపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల నిర్వాహకులు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.