మాజీ హోంమంత్రి తుళ్ల దేవేందర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు

ఘట్‌కేసర్, ఆగస్టు 11: మాజీ హోంమంత్రి తుళ్ల దేవేందర్ గౌడ్‌ను ఆయన నివాసంలో టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్, టీడీపీ సీనియర్ నాయకులు సామల జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్‌తో నాయకులు పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.