prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 7:25 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

మడిపల్లి హత్య కేసులో సర్పంచ్ తోపాటు మరో వ్యక్తి అరెస్ట్

మడిపల్లి హత్య కేసులో సర్పంచ్ తోపాటు మరో వ్యక్తి అరెస్ట్

తొర్రూరు మండలం
మడిపల్లి గ్రామంలో ఈ నెల 19వ తేదీన జరిగిన గుంటుక రమేష్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, ఇప్పటికే 15 మంది నిందితులను రిమాండ్ కు తరలించినది విధితమే. కానీ ఆదివారం విచారణ వేగవంతం చేయడంతో ఈ జరిగిన హత్యతో స్థానిక సర్పంచ్ రామలింగంతో పాటు కాయిత నరేష్‌ కు కూడా సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడి కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ దర్యాప్తులో నిందితుల సంఖ్య 17 కు చేరింది. అదేవిధంగా హత్యకు సంబంధించిన దర్యాప్తును లోతుగా పరిశీలన చేస్తున్నట్లు మరికొంతమందిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం తదుపరి వివరాలు కూడా మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.