prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:38 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

మడిపల్లి గ్రామంలో వ్యక్తి దారుణం

మడిపల్లి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య

 

తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గుంటుక రమేష్, అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, కర్రలతో రాళ్లతో దాడి చేసుకుంటూ ఊరుకు సమీపాన ఉన్న చెరువుకు ఈడ్చుకు వెళ్లి సుమారు 3:30 గంటల ప్రాంతంలో హత్య చేసి చంపినట్లు సమాచారం, ఈ ఘటనకు పాత తగాదాల వ్యక్తిగత కక్షల తెలియాల్సి ఉంది. హత్యకు గురైన వ్యక్తికి భార్య రజిత ఇద్దరు కుమార్తెలు మధువతి, ఉషశ్రీ ఉన్నారని సమాచారం.ఈ ఘటన తెలిసిన వెంటనే తొర్రూర్ పోలీసులు రంగంలోకి దిగి, హత్యకు సంబంధించిన ఆనవాళ్లను సేకరించి, తదుపరి పోస్టుమార్టం నిమిత్తం, వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్ కు పంపించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.