prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 6:21 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

మండల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలి

మండల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలి

డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ వి ప్ డాక్టర్ రామచంద్రు నాయక్

దంతాలపల్లి మండల కేంద్రంలోని బుధవారం రైతు వేదికలో నిర్వహించిన మండల జనరల్ బాడీ సమావేశానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సూచించారు. మండల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
మండల సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి పథకం షాది ముబారక్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళ శక్తి కింద మహిళలకు వడ్డీ లేని రుణాలు, 500 కి వంట గ్యాస్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దంతాలపల్లి తహసిల్దార్ సునీల్ రెడ్డి, ఎంపీడీవో, ఎంపీ ఓ అప్సర్
పా ష, మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవి,మండల వ్యవసాయ అధికారి వాహిని, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, దంతాలపల్లి సర్పంచ్, పొన్నొటి బాలాజీ, వేములపల్లి సర్పంచ్ గుమ్మడవెల్లి రవి, వివిధ గ్రామాల సర్పంచులు మండలంలోని ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.