నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా 2019 వరకు అమలైన పథకాలన్నీ కొనసాగించాలి
భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదభీమా 10 లక్షలు కల్పించాలి!
పోరుమామిళ్ల ఆగస్టు 18 ప్రజావాణి ఏపీ భవన నిర్మాణ బేల్దారులు కార్మికుల సంఘం (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో ధరలకు అనుగుణంగా రోజువారి కూలీ వెయ్యి రూపాయలు పెంచాలని పోరుమామిళ్ల పంచాయతీ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి తదనంతరం తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం చేసి ఎమ్మార్వో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మార్వో స్పందించి వెంటనే లేబర్ కార్యాలానికి ట్యాక్స్ పంపుతానని చెప్పడం జరిగిందన్నారు.ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి యన్ భైరవప్రసాద్,మండల అధ్యక్షులు సోమయ్య ఇరువురు మాట్లాడుతూ.ఈరోజు చూస్తే భవన నిర్మాణ కార్మికులు చాలా చాలా నిరుపేద కుటుంబాలుగా జీవిస్తున్నారు అని చాలీచాలని కూలీలతో జీవనం చేస్తూ ఉన్నారని ఇంటి బాడుగలు కట్టలేక ఉన్నారన్నారు పాలబిల్లు,డిష్ బిల్లు,మెడికల్ బిల్లు,ఇవన్నీ కుటుంబ భారంగా పడుతుందన్నారు అదేవిధంగా పెరిగినటువంటి పప్పు,ఉప్పు,బియ్యం,బ్యాల్లు,కూరగాయలు,నూనె,తదితర అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కార్మికులకు అందనంత దూరంలో ఉన్నాయన్నారు ఉదయం నుంచి సాయంకాలమువరకు పనిచేస్తున్నటువంటి బేల్దారులకు రోజువారి కూలీ 1000రూపాయలు పెంచాలని పైకూలి అయినటువంటి పురుషులకు 800 రూపాయలు పెంచాలని మహిళా కూలీలకు 600 రూపాయలు పెంచాలని వారు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలపై తీవ్ర వ్యతిరేకతతో 44 చట్టాలున్నటువంటి కార్మిక కోడ్లును నాలుగు చట్టాలు చేసి కార్మికులను ఉక్కు పాదంతో అంచుతా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్విరం చేసేదానికి కుట్ర పంతోందని వారన్నారు మన రాష్ట్రంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు అనేక దశాబ్దాలుగా పోరాడి 2009లో నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సాధించుకున్నారని పేర్కొన్నారు.ఈ బోర్డు ద్వారా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందారని,అవి కార్మిక కుటుంబాలకు ఎంతోకొంత ఆసరాగా నిలిచాయని తెలిపారు. 2020లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న పథకాలన్నింటినీ నిలిపివేసి కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని విమర్శించారు. అప్పటి నుండి నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు సంక్షేమ బోర్డును కొనసాగించాలని వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారని తెలిపారు.అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో సంక్షేమ బోర్డును పునఃప్రారంభించి కార్మికులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ హామీలను అమలు చేయకుండా కాలయాపన చేసిందన్నారు. కార్మికుల తీవ్రమైన ఆందోళనల ఫలితంగా సంక్షేమ బోర్డును పునఃప్రారంభించినప్పటికీ,కేవలం 4 పథకాలను మాత్రమే అమలు చేస్తామని ఈ ఏడాది ఏప్రిల్ 1న జీవో జారీ చేసి కార్మికుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ 4 పథకాల అమలుకు కూడా అనేక షరతులు విధించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.అలాగే జారీ చేసిన జీవోలో పెండింగ్ క్లెయిమ్‌ల పరిష్కారం గురించి గానీ,గతంలో అమలైన ఇతర సంక్షేమ పథకాల గురించి గానీ ఎలాంటి ప్రస్తావన లేకపోవడం కార్మికులను మోసం చేయడమేనని ప్రశ్నించారు.సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, క్లెయిమ్‌ల కోసం సచివాలయాలకు వెళ్లాలని,సంక్షేమ కార్డుల పునరుద్ధరణకు అనేక నిబంధనలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.అసలు సంక్షేమ బోర్డును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.తక్షణమే కూటమి ప్రభుత్వం భువన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా 2019 వరకు అమలులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఐక్యం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా భవన నిర్మాణం బేల్దారి మేస్త్రిలు పోరుమామిళ్ల మండల నాయకులు ఠాగూర్,నాగరాజు జాఫర్ ఇరువురు మాట్లాడుతూ.
ధరలకు అనుగుణంగా ప్రతి బేల్దారికి కూలి రేట్లు పెంచాలని భవన నిర్మాణ బేల్దారులుకు ప్రమాద బీమా 10 లక్షల కల్పించాలని 50 సంవత్సరాల నిండిన ప్రతి బేల్దారి కార్మికులకు ప్రభుత్వం వెంటనే పింఛన్ సౌకర్యం కల్పించాలని భవన నిర్మాణ సంక్షేమ బోర్డును యధావిధిగా కల్పించాలని భవన నిర్మాణ కార్మికులైన కార్మికులకు ఇంటి స్థలము ఏర్పాటు చేసి కాలనీ ఏర్పాటు చేయాలని వారు అన్నారు మా సమస్యలు తీర్చకుంటే పెద్ద ఎత్తున కడప లేబర్ ఆఫీస్ ముందు ధర్నాకు చేస్తామని వారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ప్రకాష్ బేల్దారుల యూనియన్ నాయకులు కార్యకర్తలు అలీ భాష,గురప్ప సిద్దయ్య రాజు మోహన్ ఉదయగిరి మస్తాన్ వెంకటయ్య పోల్ రెడ్డి భాస్కర్ బాల వెంకటేష్ శ్రీనివాసులు సంటయ్య ప్రకాశం ఎల్ రమణయ్య నాగేంద్ర బేల్దారి కార్మికులు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది