బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న గరుడాద్రి క్షేత్రం..13 నుంచి 19 వరకు శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు

ఘట్‌కేసర్, ఆగస్టు 10 (ప్రజావాణి):  మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్‌లో ఉత్తర శ్రీ విల్లిపుత్తూరుగా ప్రసిద్ధి చెందిన గరుడాద్రి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో శ్రీ గోదా సమేత మన్నారు రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను ఆగస్టు 13 నుంచి 19 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి...