బొప్పపురం లో  దారుణం జరిగింది: భార్య, కూతురు దాడిలో తీవ్రంగా గాయపడిన కాకర్ల బాలయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు.

కడప జిల్లా పోరుమామిళ్ల ఆగస్టు 25 ప్రజావాణి  మండలం బొప్పాపురం గ్రామంలో చోటుచేసుకున్న ఈ కిరాతక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నకూతురు, భార్య కలిసి ఒక వ్యక్తి ప్రాణాలు తీసే వరకు వెళ్లడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ కలహాలే కారణమా? పోరుమామిళ్ల మండలం బొప్పాపురం గ్రామానికి చెందిన కాకర్ల బాలయ్య (55) అనే వ్యక్తికి, అతని భార్య లక్ష్మీదేవి, కూతురు కృష్ణకుమారి కి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే...