prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 2:13 pm Digital Edition : RAJASHEKARREDDY

బెజ్జంకి 108 అంబులెన్స్‌లో ఆకస్మిక తనిఖీ ” రికార్డులు, వైద్య పరికరాలు, మందుల స్టాక్ పరిశీలించిన” ప్రోగ్రాం మేనేజర్ -బాయిని సంపత్

బెజ్జంకి, (ప్రజావాణి )ఆగస్టు 31

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను సిద్దిపేట ప్రోగ్రాం మేనేజర్ బాయిని సంపత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని రికార్డులు, వైద్య పరికరాలు, మందుల స్టాక్‌ను పరిశీలించి వాటి పనితీరును తనిఖీ చేశారు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర కేసు సమాచారం అందిన వెంటనే 30 సెకన్లలోపు అంబులెన్స్‌ను ప్రారంభించి, బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సిబ్బందికి సూచించారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంపత్ సూచించారు. విధుల్లో ఎటువంటి లోటుపాట్లు ఏర్పడినా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలో మెడికల్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ ఎస్. రాజు, పైలట్ బి. రాజమల్లు పాల్గొన్నారు.