prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 2:42 pm Digital Edition : RAJASHEKARREDDY

*బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలి* -సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేత

బెజ్జంకి,ఆగష్టు 31,ప్రజావాణి

సిద్దిపేట జిల్లా లోని బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ మాట్లాడుతూ.. బెజ్జంకి మండలాన్ని ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లాలో చేర్చారని అన్నారు. సిద్దిపేటలో కలెక్టరేట్, హుస్నాబాద్‌లో ఆర్డీవో కార్యాలయం ఉండటంతో మండల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు అధిక రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోందని తెలిపారు.ప్రజల రవాణా, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేసి బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని సిపిఐ తరఫున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్  జిల్లా నాయకులు బోనగిరి శ్రావణ్,  ఏఐవైఎఫ్  మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్, ప్రశాంత్, అంజి తదితరులు పాల్గొన్నారు.