బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బెజ్జంకి, ఆగస్టు 15 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీస్‌స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.