బెజ్జంకిలో నిర్వహించిన ప్రజావాణికి 11 ఫిర్యాదులు- రెవెన్యూ శాఖకు 8 ఫిర్యాదులు.. రెండు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం
బెజ్జంకి, ఆగస్టు 17 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో కడివెర్గు ప్రవీణ్ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు 8, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలకు ఒక్కో ఫిర్యాదు చొప్పున వచ్చినట్లు నోడల్ అధికారి ప్రవీణ్ తెలిపారు.విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగతా ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.