బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు,మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ ప్రభుత్వం చేయూత -కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి
బెజ్జంకి, ఆగస్టు 19 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీసీ మహిళల కుట్టు మిషన్ల పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సహాయం, స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత అందించనుందని గుగ్గిళ్ల గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల నైపుణ్యాలను...