prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 1:35 pm Digital Edition : SHEKARREDDY PATANCHERUV

బీరంగూడ శ్రీకృష్ణ నగర్‌లో అక్రమ అంతస్తులపై కొరడా

•బీరంగూడ శ్రీకృష్ణ నగర్‌లో అక్రమ అంతస్తులపై  కొరడా !

•నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అంతస్తులను కొలిచివేసిన అమీన్పూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు

అమీన్పూర్, ఆగస్టు 29 (ప్రజావాణి): అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ శ్రీకృష్ణ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తులపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులకు మించి నిర్మించిన అంతస్తులను అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.
శ్రీకృష్ణ నగర్ కాలనీలో భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించిన అమీన్పూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. సంబంధిత భవనాలను పరిశీలించిన అనంతరం, అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన అదనపు అంతస్తులపై కొలతలు చేపట్టి అక్రమ నిర్మాణాల వివరాలను నమోదు చేశారు.
అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుందని, నిబంధనలను అతిక్రమించి భవనాలు నిర్మించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. భవన యజమానులు అనుమతులు, సెట్‌బ్యాక్‌లు, నిర్మాణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
బీరంగూడ శ్రీకృష్ణ నగర్‌లో అక్రమ అంతస్తులపై టౌన్ ప్లానింగ్ అధికారుల చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో అమీన్పూర్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపైనా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.