బస్వాపూర్‌లో 16 సీసీ కెమెరాలు ప్రారంభం-నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల అవగాహన
కోహెడ, ఆగస్టు 12(ప్రజావాణి) సిద్దిపేట జిల్లాలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో “సురక్ష నేత్ర” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీ సదానందం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపీ సదానందం, కోహెడ ఎస్సై అభిలాష్ గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో జిల్లాలో కొత్త సీసీ...