బద్వేలు ఆగస్టు 28/ప్రజావాణి సబ్ రిజిస్టర్ గతంలో పొద్దుటూరు పట్టణం సబ్ రిజిస్టర్ గా పనిచేసిన సమయంలో విద్యాసాగర్ రెడ్డి అనేక అక్రమాలు నకిలీ పత్రాలు తో పొద్దుటూరు చుట్టుపక్కల మండలాలు అక్రమ రిజిస్టర్లు చేసిన ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములును కూడా వదలకుండా రిజిస్టర్ చేయడమనేది చట్టాన్ని ప్రభుత్వాన్ని ధిక్కరించి డబ్బులు కోసం ఎంతటి పనైనా అతను దళారులను పెట్టుకొని పనిచేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. విద్యాసాగర్ రెడ్డి పై అతని అనుచరులు పదిమందిపై కేసు నమోదు చేయడం జరిగింది వెంటనే అరెస్టు చేయాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్యలు మాట్లాడుతూ బద్వేల్ సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ రెడ్డి దాదాపు సంవత్సరం పైబడి కావస్తుంది ఈయన సబ్ రిజిస్టర్ గా బాధ్యతలు చేపట్టినట్టునుండి ఇప్పటివరకు మాదిగ మాన్యం పేద రైతులు భూములు రిజిస్టర్ వచ్చిన ఇళ్లస్థలాలు రిజిస్ట్రేషన్ కు వారి దగ్గర నుండి లోపల ఫీజు బయట ఫీజ్ అని దళారులను ( నాగేందర్ రెడ్డి )పెట్టుకొని రోజుకు 50 రిజిస్టర్లు చేస్తూ బద్వేల్ లో కూడా కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. ఇదే కాకుండా స్టాంపర్లు ఆందోళన ధర్నాలు చేస్తుంటే సబ్ రిజిస్టర్ విద్యాసాగర్ రెడ్డి తన దళారులు అనుచరుడు నాగేందర్ రెడ్డి పెట్టుకొని రాత్రి పగలు అనుకోకుండా నకిలీ పత్రాలతో లెక్కలేనన్ని రిజిస్టర్లు చేయడం జరిగింది. రిజిస్టర్ లన్ని రద్దు చేయాలని పై అధికారులు విచారణ చేపట్టి ఇతను రిజిస్టర్ చేసిన అన్నిటిని తొలగించాలని, లేనిపక్షంలో కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళిత ప్రజాసంఘాలతో ఆందోళన చేపడతామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విద్యాసాగర్ రెడ్డి పై సబ్ రిజిస్టర్ పై పొద్దుటూరులో క్రిమినల్ అనుచరులను పై కేసు నమోదు అయినందువలన బద్వేల్ సబ్ రిజిస్టర్ విధుల నుంచి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు పెసల రఘు పాల్గొన్నారు.