ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: టీపీసీసీ నాయకులు పెర్క శ్యామ్
వైట్ హౌస్‌లో గ్రాండ్ గా ఫీల్డ్ అసిస్టెంట్ల నూతన జిల్లా కమిటీ ఎన్నిక పెద్దపల్లి, ఆగస్టు 9 ప్రజావాణి : రాష్ట్రంలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు సంపూర్ణ కృషి చేస్తానని టీపీసీసీ నాయకులు, జననేత పెర్క శ్యామ్ స్పష్టం చేశారు. స్థానిక పెద్దపల్లి వైట్ హౌస్‌లో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు భూమాల చంద్రన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల (క్షేత్ర సహాయకుల) నూతన జిల్లా కమిటీ ఎన్నికల కార్యక్రమానికి...