ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

నంగునూరు, ఆగస్టు 24 (ప్రజావాణి): విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు సిద్దిపేట జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రజనీకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన రామచంద్రరావును కలిసి మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా రజనీకర్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు....