ప్లాస్టిక్ నివారణకు గోల్డెన్ మటన్ షాపు వినూత్న ప్రయత్నం…టిఫిన్ బాక్స్ తెస్తే మటన్‌పై రూ.50 తగ్గింపు
ఘట్‌కేసర్, ఆగస్టు 24 (ప్రజావాణి): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఘట్‌కేసర్ బాలాజీనగర్–కరీంగూడ రోడ్డులోని గోల్డెన్ మటన్ షాపు యజమానులు లక్ష్మణ్, నగేష్, మధు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మటన్ కొనుగోలుకు వచ్చే వినియోగదారులు తమ వెంట టిఫిన్ బాక్స్ తీసుకువస్తే మటన్‌పై రూ.50 తగ్గింపు అందిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు షాపు యజమానులు తెలిపారు. తమ ప్రయత్నానికి వినియోగదారుల...