prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 1:07 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

‘ప్రాథమిక విద్య’ చిత్రానికి ప్రత్యేక బహుమతి..

జాతీయ స్థాయిలో ఉత్తమ వార్తా చిత్రంగా ఎంపిక

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ‘ప్రాథమిక విద్య’ అంశంపై తీసిన చిత్రానికి ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక బహుమతికి ఎంపికయ్యారు. ఈ అవార్డును ఈ నెల 23న ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అందుకోనున్నారు. అదేవిధంగా కర్ణాటక మీడియా సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ఆయన తీసిన మరో వార్తా చిత్రం ఉత్తమ వార్తా చిత్రంగా ఎంపికైంది. ఫోటో జర్నలిజంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న శ్రీనివాస్ గౌడ్‌ కు గతంలోనూ పలు ఉత్తమ వార్తా చిత్రాలకు అవార్డులు లభించాయి. వరుసగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తున్న ఆయనను పలువురు అభినందించారు.