ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ డిపో మేనేజర్
ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ మేడ్చల్: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించేందుకు మేడ్చల్ ఆర్టీసీ డిపోలో ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు బస్సుల నిర్వహణ, సర్వీసులు, ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులపై వారి నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీమతి పరిమళ తెలిపారు. ఈ కార్యక్రమం ఆగస్టు 21, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1...