ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్ట పరచాలి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి
ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్ట పరచాలి – కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి ఆగస్టు 30న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా విద్యా సదస్సు మేడ్చల్: ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరచాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 30న జిల్లా విద్యా సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఎం మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్ తెలిపారు. ప్రగతినగర్‌లోని పుచ్చలపల్లి లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10:30 గంటలకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు,...