prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 4:46 pm Digital Edition : BALAKRISHNA BIRKOOR

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ

డోంగ్లీ మండలం, మల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన 47 జతల యూనిఫామ్‌లను గురువారం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ అమృత్వర్ శ్రీకాంత్ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు మనుష మేడం, మహిళా సంఘం APM జగదీష్, CC అబ్దుల్ రషీద్, VOA అమృత్వర్ రుక్మిణి, ఉప సర్పంచ్ సంతోష్, గ్రామ సెక్రటరీ ప్రమోద్, GP కారోబారి నాగేష్, అమృత్వర్ శ్రీను, శెట్టేవర్ రాజు, గ్రామ పెద్దలు, అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.