ప్రభుత్వ నిబంధనలకు పాతర: సెలవు దినాల్లోనూ నడుస్తున్న ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్*!

విద్యాశాఖ ఆదేశాలు బేఖాతరు.టెన్త్ విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి! రంగంలోకి దిగిన ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్..‘మాదే స్కూల్’ అంటూ బెదిరింపులు? చిలకలూరిపేట,ఆగస్టు 26 (ప్రజావాణి ఏపీ క్రైమ్ బ్యూరో):చిలకలూరిపేట పట్టణంలోని జాకీర్ హుస్సేన్ స్ట్రీట్‌లో ఉన్న ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థ ‘ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్’ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. విద్యాశాఖ ఆదేశాలను, అధికారిక సెలవు దినాలను సైతం లెక్కచేయకుండా పాఠశాలను నిర్వహిస్తూ విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతోంది. తాజాగా ఈ పాఠశాల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షల కాలపట్టిక...