విద్యాశాఖ ఆదేశాలు బేఖాతరు.టెన్త్ విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి! రంగంలోకి దిగిన ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్..‘మాదే స్కూల్’ అంటూ బెదిరింపులు?
చిలకలూరిపేట,ఆగస్టు 26 (ప్రజావాణి ఏపీ క్రైమ్ బ్యూరో):చిలకలూరిపేట పట్టణంలోని జాకీర్ హుస్సేన్ స్ట్రీట్‌లో ఉన్న ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థ ‘ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్’ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. విద్యాశాఖ ఆదేశాలను, అధికారిక సెలవు దినాలను సైతం లెక్కచేయకుండా పాఠశాలను నిర్వహిస్తూ విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతోంది. తాజాగా ఈ పాఠశాల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షల కాలపట్టిక ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. పరీక్షల పేరుతో విద్యార్థులపై వేధింపులు,సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదివారాలు, పండుగ రోజులు, ప్రభుత్వం ప్రకటించే ప్రత్యేక సెలవు దినాల్లో విద్యాసంస్థలు మూసి ఉంచాలి. కానీ, ఈ ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్థులకు కనీస విశ్రాంతి లేకుండా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించింది. ఉదయం ఒక పరీక్ష, సాయంత్రం ఒక పరీక్ష చొప్పున ఒకే రోజు రెండు ప్రధాన పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
విడుదలైన వివాదాస్పద టైమ్ టేబుల్ ప్రకారం:
* ఉదయం సెషన్: 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు
* సాయంత్రం సెషన్: 03:30 గంటల నుండి 05:30 గంటల వరకు ఈ విధంగా రోజుకు రెండు పూటలా, సెలవు దినాల్లో సైతం పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. విరామం లేని చదువులు, పరీక్షలతో బాల్యాన్ని బలిచేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెలుగులోకి ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ పాత్ర..ఫోన్లలో సంభాషణలు!ఈ వ్యవహారంలో మరో నమ్మశక్యం కాని నిజం వెలుగులోకి వచ్చింది. స్కూల్ యాజమాన్యం చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చేందుకు, స్థానిక మీడియాను మేనేజ్ చేసేందుకు ఒక ప్రముఖ దినపత్రిక ప్రతినిధి తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ స్వయంగా రంగంలోకి దిగి,ఆ స్కూల్ మాదే..దాని జోలికి రావద్దు,అంటూ ‘ప్రజావాణి ఏపీ క్రైమ్ బ్యూరో’కు ఫోన్ చేసి మాట్లాడటం పట్టణంలో కలకలం రేపుతోంది.జర్నలిజం ముసుగులో విద్యాసంస్థల అక్రమాలకు కొమ్ముకాయడం, ప్రశ్నించిన వారిని ఫోన్లలో సంబోధిస్తూ (ప్రభావితం చేసేలా మాట్లాడటం) సర్దుబాటు చేయాలని చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘించిన స్కూలును వెనకేసుకురావడంలో సదరు రిపోర్టర్ ఆర్థిక ప్రయోజనాలు లేదా భాగస్వామ్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు?పట్టణ నడిబొడ్డున ఉన్న జాకీర్ హుస్సేన్ స్ట్రీట్‌లో ఇంత బహిరంగంగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా, స్థానిక విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారుల అండదండలు లేదా పొలిటికల్, మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్లే అధికారులు ఇటువైపు చూడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఇటువంటి చర్యలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని, సెలవుల్లో స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై మరియు వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.