ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న -ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …

  భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో *తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందాన్ని, చైతన్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు...