ప్రతాపసింగారంలో ఘనంగా శ్రీ భవానీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు…..సుమారు రూ.2 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు — స్లాబ్ నిర్మాణానికి రూ.1.40 లక్షల సహకార
ఘాట్ కేసర్: పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాపసింగారం గ్రామంలో శ్రీ భవానీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి గారి సహకారంతో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో కొనసాగుతున్నాయి.
పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ స్లాబ్ నిర్మాణానికి రూ.1.40 లక్షల విలువైన సహకారాన్ని పోచారం డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ యుగేందర్ రెడ్డి గారి సౌజన్యంతో అందించారు. శ్రీ సుధీర్ రెడ్డి గారి సమక్షంలో స్లాబ్ నిర్మాణ పనులు నిర్వహించారు.
ఈ సందర్భంగా యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మన సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలు ప్రతీకలని, వాటి అభివృద్ధి మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తయి భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.