ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఇంటింటి ప్రచారం….కేంద్ర బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలి….సెప్టెంబర్ 1న చలో ఢిల్లీని విజయవంతం చేయాలి: సీపీఐ

ఘట్‌కేసర్, ఆగస్టు 9: “బద్లావ్ జరూరీ హై.. మార్పు కావాలి” అనే నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఘట్‌కేసర్ మండల కేంద్రంలో విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేపట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి అనంతరం ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి...