ప్రజాస్వామ్య పరిరక్షణకు సీపీఐ నిరంతర పోరాటం…సెప్టెంబర్ 1న ఢిల్లీలో మహా ధర్నా..ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర
ఘట్‌కేసర్, ఆగస్టు 10 (ప్రజావాణి): ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎంఎంసీ పోచారం డివిజన్ అన్నోజిగూడలో సోమవారం గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, సహాయ కార్యదర్శి సయ్యద్ ఖదీర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి...