ప్రజావాణి కథనానికి స్పందన..
••మిడ్ మానేరు బ్యాక్‌వాటర్‌ను సందర్శించిన ఎస్పీ.
మానేరు బ్యాక్‌వాటర్ వద్ద కార్లతో స్టంట్లు.. అత్యుత్సాహంపై స్పందన.
తంగళ్లపెల్లి, ప్రజావాణి
తంగళ్లపల్లి మండలం గోపాల్‌పల్లి గ్రామ శివారులోని మిడ్ మానేరు బ్యాక్‌వాటర్‌ను ఎస్పీతో పాటు అధికారులు సోమవారం సందర్శించారు. మానేరు బ్యాక్‌వాటర్ వద్ద సందర్శకులు కార్లతో స్టంట్లు చేస్తూ అత్యుత్సాహానికి పాల్పడుతున్నారంటూ ప్రజావాణిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు.బ్యాక్‌వాటర్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ.. సందర్శకుల భద్రత, వాహనాల స్టంట్ల నియంత్రణపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ప్రమాదాలకు తావులేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
సందర్శకులు కూడా నిబంధనలు పాటిస్తూ ప్రమాదకర స్టంట్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
