ప్రజావాణిలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ వినతి
ప్రజావాణిలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ వినతి టేకుమట్ల, ప్రజావాణి: టేకుమట్ల మండలంలోని చలివాగు పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను తక్షణమే అరికట్టాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో వసంత్ రామ్, తహసీల్దార్ స్వరూప రాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. మండలంలోని ఏయే గ్రామాల్లో ఇసుక రవాణాకు అధికారికంగా అనుమతులు ఉన్నాయో జిల్లా గనుల శాఖ అధికారులు...