ప్రజావాణికి విశేష స్పందన.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారుల భరోసా
ప్రజావాణికి విశేష స్పందన.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారుల భరోసా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో మరోసారి విశేష స్పందన లభించింది. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్, జిల్లా రెవెన్యూ అధికారి మాలతి ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు....