పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ సుందర్
పోరుమామిళ్ల (కడప జిల్లా): వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, దేశభక్తి ఉత్సాహాల మధ్య నిర్వహించారు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీస్ సిబ్బంది ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించిన అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ సుందర్,సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సై హనుమంతు,హాజరయ్యారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని వారు గౌరవవందనం చేస్తూ ఆవిష్కరించారు....