prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 9:17 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్ల పట్టణంలోని హోలీ రోజరీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

పోరుమామిళ్ల ఆగస్టు 15 ప్రజావాణి పట్టణంలోని హోలీ రోజరీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగా యనడంలో అతిశయోక్తి లేదు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ సుందర రావు,విచ్చేసి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల ప్రతిభను గుర్తించి అభినందించారు ఆటల పోటీలలో రాణించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు పాఠశాల విద్యార్థులు తయారుచేసిన త్రివర్ణ పతాకాలను తిలకించడం జరిగినది తదనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని బాల్యవివాహాలను అరికట్టాలని ప్రతిరోజు వ్యాయామం చేసి శరీర దృఢత్వం పెంచుకోవాలని భావి భారత పౌరులుగా ఎదగాలని తెలియజేశారు పాఠశాల ప్రిన్సిపాల్ గారైన రెవరెండ్ ఫాదర్ సునీల్పతాకావిష్కరణ గావించి తదనంతరం విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు మీరే రాబోవు తరానికి ఆశా దీపాలు అని నుడివారు చివరిగా విద్యార్థులందరికీ స్వీట్స్ పంచడం జరిగినది అందులో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు న్యూస్ రిపోర్టర్స్ పాఠశాల సిబ్బంది పాల్గొని 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు