పోరుమామిళ్లలో సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన ఉపాధ్యాయుడు:
పోరుమామిళ్ల,ఆగస్టు 18 ప్రజావాణి:ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే సంకల్పంతో ఒక ఉపాధ్యాయుడు తన ఉదారతను చాటుకున్నారు.కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా,పాఠశాల ప్రగతిలో భాగస్వామి అవుతూ తోటివారికి ఆదర్శంగా నిలిచారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల (మెయిన్) కు గత సంవత్సరం జరిగిన బదిలీలలో ఉపాధ్యాయుడు చిన్నపురెడ్డి వెంకటరెడ్డి బదిలీపై వచ్చారు. పాఠశాలలో విద్యార్థుల అవసరాలను గమనించిన ఆయన,మౌలిక వసతుల కొరతను తీర్చడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రూ. 30 వేల సొంత...