పోరుమామిళ్లలో ఘోర ప్రమాదం: ఒకరి మృతి.. అధికారుల ఉదాసీనతకు బలైన అమాయక ప్రాణం!

* ఫుట్‌పాత్‌ల ఆక్రమణలే శాపంగా మారిన వైనం * పట్టించుకోని పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ యంత్రాంగం * ప్రాణాలు పోతున్నా రాని మెలకువ.. ప్రజల ఆగ్రహం పోరుమామిళ్ల, ఆగస్టు 14:ప్రజావాణి స్థానిక అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కారణంగా పోరుమామిళ్ల పట్టణంలో ఒక అమాయక ప్రాణం గాల్లో కలిసిపోయింది. పట్టణంలోని గాజుల టీ అంగడి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శీనప్ప బావి వీధికి చెందిన మస్తాన్ (37) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా...