పోరుమామిళ్లలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు,దేశంలో,రాష్ట్రంలో మార్పు రావాలి,మార్పు కావాలి సిపిఐ ప్రతిజ్ఞ
పోరుమామిళ్ల ఆగస్టు 16 (ప్రజావాణి)తిరుపతి రెడ్డి కాలనీలో ఆగస్టు 15,80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యుడు సఫా అధ్యక్షతన సమావేశంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,మండల కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో అర్ధరాత్రి ఒంటిగంటకు స్వేచ్ఛగా ఇంటికి మహిళా ఏ రోజు రాగలిగితే ఆరోజు స్వాతంత్రం వచ్చినట్లు అని వారన్నారు. అలాగే “దేశంలో మార్పు కావాలి–మార్పురావాలి అనే నినాదంతో నరేంద్ర మోడీ అధికారంలోకి...